డాబాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని డాబాలను శనివారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్సై సురేష్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హైవే పక్కన ఉన్న డాబాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించామన్నారు. డాబాల వద్ద భారీ వాహనాలను పార్కింగ్ చేయవద్దని డాబా నిర్వాహకులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.