గడ్డి వాములకు అగ్ని ప్రమాదం

కృష్ణా: మచిలీపట్నం మండలం చిన్నయాదరలో కంచర్లపల్లి వెంకట రమణ (తాతయ్య) ఇంటి వద్ద గురువారం వరిగడ్డి వాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. స్థానికుల ప్రయత్నాలు విఫలమవడంతో అగ్నిమాపక శాఖ స్పందించి మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల చర్యతో గ్రామంలో భయాందోళన నెలకొంది.