నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్ పై అవగాహన సదస్సు
JN: లింగాల గణపురం మండల పరిషత్ కార్యాలయంలో National SC-ST Hub పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, EDC ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీఎం శివకృష్ణ ఠాగూర్, ఎంపీడీవో శివశంకర్ రెడ్డి పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.