అవయ్యాడులో అధికారుల ఆకస్మిక తనిఖీ..!
E.G: పెరవలి మండలం అవయ్యాడు గ్రామంలో గురువారం ఉదయం అధికారులు ఆకస్మికంగా పర్యటించారు. దెబ్బతిన్న రహదారులు, పారిశుద్ధ్య లోపాలు, నిల్వ ఉన్న మురుగునీటిపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు తమ సమస్యలను అధికారులకు వివరించారు. స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.