'అక్రమ వలసదారులను స్వదేశాలకు తరలించాలి'

MDK: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్తానీలను పంపించివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. పహల్గామ్ దాడి ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తరలించాలని వారు డిమాండ్ చేశారు.