గోనుపాడులో చలివేంద్రం ప్రారంభం

గోనుపాడులో చలివేంద్రం ప్రారంభం

GDWL: వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని గోనుపాడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. సర్పంచ్ జి.రాములమ్మ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించి, ఉపసర్పంచ్, కార్యదర్శి పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు. తొలిరోజు వడ్డే పరుష రాముడు మజ్జిగ పంపిణీ చేశారు. దాహార్తి నివారణకు రాగిజావ, మజ్జిగ వంటి పానీయాలను స్వచ్ఛందంగా అందించాలని సర్పంచ్ కోరారు.