'తెలుగువారి ఆత్మగౌరవం టీడీపీ'

KDP: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు TDP పార్టీ ఆవిర్భవించిందని సిద్ధవటం టీడీపీ నేతలు అన్నారు. శనివారం సిద్ధవటం మండలంలోని భాకరాపేటలో TDP పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.