ఒంగోలు రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, ఈగల్ టీం పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ టీం సీఐ సుధాకర్ తెలిపారు.