'రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
SRCL: మొంత తుఫాన్‌తో పంటల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల్ కార్ బాలాజీ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుఫాన్ వల్ల చేతికి వచ్చిన వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయన్నారు. వరదతో కొట్టుకపోయిన కాజ్వేలను, బ్రిడ్జిలను వెంటనే నిర్మాణం చేపట్టారని కోరారు.