రోడ్డు భద్రతపై అవగాహన చేపట్టాలి: కలెక్టర్
MLG: రోడ్డు ప్రమాదాల నియంత్రనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ దివాకర్ కోరారు. కలెక్టరేట్ ఛాంబర్లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ, పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రమాదాల నియంత్రణపై రవాణా శాఖ అవగాహన చేపట్టాలని కోరారు.