VIDEO: సింహాచలంలో వైభవంగా గరుడ సేవ
VSP: సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పాంచరాత్రాగమశాస్త్ర విధానంలో సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళాశాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.