లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులు అందజేత

లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులు అందజేత

VZM: గంట్యాడ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం అందజేశారు. 9,71,974 రూపాయల చెక్కులను ఎనిమిది మంది లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్ అందజేశారు. ఖరీదైన వైద్యం ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన మంత్రి శ్రీనివాస్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.