అత్యవసర సేవలను వినియోగించుకోవాలి: తహసీల్దార్

BDK: భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతాలను గురువారం నాడు తాహసీల్దార్ సందర్శించారు. గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అధికారులకు సహకరించి వారి సూచనలు సలహాలు పాటించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యవసర సేవలను వినియోగించుకోవాలని సూచించారు.