తల్లిబిడ్డ ప్రాణం తీసిన ఫోన్ సిగ్నల్
ADB: తల్లిబిడ్డ చనిపోయిన విషాద ఘటన ఉట్నూర్ మండలం రాజులమడుగులో అలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ మహిళకు సోమవారం పురిటినొప్పులు రావడంతో ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనం ఆగిపోయింది. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ కూడా లేవు. దీంతో తిరిగి ఇంటికి తరలించారు. అప్పటికే నొప్పులు అధికమవ్వడంతో ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ మృతిచెందారు.