భాదితులకు భరోసాగా సఖి కేంద్రాలు: కలెక్టర్

KMM: అన్యాయానికి గురైన బాధితులకు అండగా భరోసా కేంద్రాలు రక్షణ కల్పిస్తాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, భరోసా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళల రక్షణ, సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సఖి సెంటర్లు దోహదపడుతున్నాయన్నారు.