ఘనంగా మదర్ థెరీసా జయంతి వేడుకలు

SKLM: జలుమూరు మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా మదర్ థెరీసా జయంతి వేడుకలను నిర్వహించారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎంఈవోలు బమ్మిడి మాధవరావు, ఎం. వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మదర్ థెరీసా సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ప్రతి ఒక్క నిరుపేదకు ఆదుకునేందుకు ఆమె చేసిన కృషి నేటి యువత అలవర్చుకోవాలని తెలిపారు.