కర్మన్‌ఘాట్ గుడిలో పులిహోర వివాదం.. EO వివరణ

VKB: కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో కుళ్లిన పులిహోర ప్రసాదం పంపిణీ అయిందన్న వార్తల్లో నిజం లేదని ఆలయ EO లావణ్య స్పష్టం చేశారు. రోజూ ప్రసాదం తయారు చేసి అందజేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ చేయబోమని తెలిపారు. కొంతమంది కావాలనే ఆలయ ప్రతిష్ఠను, భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టింది.