రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో అక్రమాలు..!

రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో అక్రమాలు..!

WGL: రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో మాన్యువల్ రిసిప్ట్స్‌తో దోపిడీ కొనసాగుతోంది. టైమ్, డేట్, వాహన నంబర్ లేకుండా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కంప్యూటరైజ్డ్ టికెట్ విధానం పాటించకపోవడంతో ప్రభుత్వానికి GST నష్టం జరుగుతోందని, కాంట్రాక్టర్ వివరాలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.