నందికొట్కూరులో పొట్టి శ్రీరాములు వర్ధంతి
NDL: నందికొట్కూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బేబీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జయరామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గీత్త జయసూర్య హాజరై పూలమాలవేసి ఘనంగా సోమవారం నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు.