వింత ఘటన.. బతికుండగానే చంపేశారు..!
KKD: వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన అల్లు నాగబాబు అనే వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఆరోగ్యశ్రీ కింద గుండె శస్త్రచికిత్స చేయించుకోవాలని చూడగా, రికార్డుల్లో తాను మరణించినట్లు ఉండటంతో కంగుతిన్నాడు. గతంలో డయాలసిస్ చేసిన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ తప్పిదం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.