బావిలో పడి వృద్దురాలు మృతి

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ వృద్ధురాలు ప్రమాదవశత్తు బావిలో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాధ దేవవ్వ(81) అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో వారి ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో శనివారం శవమై తేలింది.