నేడు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలు విడుదల

నేడు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలు విడుదల

తిరుమల శ్రీవారి ఆలయంలో DEC 30 నుంచి ప్రారంభంకానున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి, మొదటి మూడు రోజులకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు మధ్యాహ్నం 2 గంటలకు TTD విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు సోమవారం ముగిశాయి. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తుల వివరాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.