వారి టార్గెట్ వృద్ధులే.. సైబర్ మోసాల పట్ల జాగ్రత్త..!

HYD: సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్ చేస్తున్నారని HYD సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. వివిధ బీమా సంస్థల నుంచి డేటా సేకరించి, CBI, ED, కస్టమ్స్ పేరిట మాయ మాటలు చెప్పి, బ్యాంకు ఖాతా వివరాలు, పలు డిపాజిట్ల వివరాలు సేకరించి కోట్లు కొల్లకొడుతున్నారని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి కాల్స్ వచ్చిన వెంటనే కట్ చేయాలన్నారు.