'బైకుకు నిప్పు పెట్టిన దుండగులు'

'బైకుకు నిప్పు పెట్టిన దుండగులు'

 మార్కాపురంలో కాలువకట్ట వద్ద నివాసం ఉండే కన్సల్ టెంట్ నిర్వాహకుడు షేక్ రఫీకి చెందిన FZ బైకును గుర్తు తెలియని దుండగులు సోమవారం నిప్పు పెట్టారు. బైకు ఇంటి ముందు పార్కు చేసి ఉండడంతో పూర్తిగా దగ్ధం అయింది. దీంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందని రఫీ వాపోయాడు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే నిప్పుంటిచారని రఫీ పోలిసులకు ఫిర్యాదు చేసాడు.