'జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలి'

VZM : ప్రజలు జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో 'నియోజకవర్గ స్థాయి స్వర్ణాంధ్ర - 2047' అనే అంశంపై సమీక్ష సమావేశం జరిగింది. స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు అధికారులు ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు.