పీజీ అకాడమిక్ సెల్ ప్రారంభం

పీజీ అకాడమిక్ సెల్ ప్రారంభం

విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అకాడమిక్ సెల్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు ప్రిన్సిపాల్ డా. బి. దేవి మాధవి తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ విద్యార్థుల అకాడమిక్ కార్యకలాపాల సమన్వయం కోసం ఈ సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం ప్రారంబోత్సవంలో భాగంగా డా. వై. పద్మశ్రీ క్లినికల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.