హెల్మెట్ వినియోగంపై పోలీసుల అవగాహన
BPT: వేటపాలెం మండలంలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎస్సై ఆధ్వర్యంలో హైవే జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్యెట్ ప్రయోజనాలు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణ రక్షణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.