రాధాకృష్ణపై ఎమ్మెల్సీ ఫిర్యాదు

రాధాకృష్ణపై ఎమ్మెల్సీ ఫిర్యాదు

VSP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని MLC వరుదు కళ్యాణి కోరారు. ఈ మేరకు ఆమె ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలపై హత్యాచారాలు ఎక్కువ అయ్యాయని మండిపడ్డారు. అలాగే, మహిళలపై చులకన భావనతో మాట్లాడే వారికి ప్రభుత్వం మద్దతు తెలిపేవిధంగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు.