స్వల్పంగా పెరిగిన పత్తి ధర

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,400 పలకగా బుధవారం 50 పెరిగి రూ.7,450 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం యార్డుకు రైతులు 82 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,450, కనిష్ఠంగా రూ.7,000 ధర పలికింది. గోనె సంచుల్లో 1 క్వింటా తీసుకురాగా.రూ. 5,211 పలికింది.