భారీగా పడిపోతున్న భూగర్భ జలాలు

భారీగా పడిపోతున్న భూగర్భ జలాలు

సత్యసాయి: జిల్లాలో భూగర్భ జలమట్టం భారీగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో నీటిమట్టం 15.38 మీటర్ల లోతులో నమోదైంది. జనవరి నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే ఏకంగా 2.72 మీటర్ల మేర నీరు అట్టడుగుకు వెళ్లడం గమనార్హం. ఎండల తీవ్రతకు తోడు వినియోగం పెరగడంతో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. వర్షాలు పడాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.