15 నుండి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు

PDPL: మే 15 నుంచి 18 వరకు తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి మానస్ కుమార్, మార్కపురి సూర్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి బస్టాండ్ వద్ద బుధవారం ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. దేశంలో నిరుద్యోగ సమస్య అధికమైందని, యువతకు ఉపాధి కల్పించడంలో కాలయాపన చేయడం లేదన్నారు.