ఎంఈఓ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా

ఎంఈఓ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా

ATP: గుత్తి ఎంఈఓ కార్యాలయం ఎదురుగా బుధవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ముందస్తుగా అడ్మిషన్ చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈఓ రవి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.