VIDEO: ఏటూరునాగారం అడవుల్లో కార్చిచ్చు
MLG: ఏటూరునాగారం అడవుల్లో మరోసారి కార్చిచ్చు అంటుకుంది. తాడ్వాయి- పస్రా- మేడారం అడవుల్లో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. ఈ మంటల్లో అడవుల్లోని వందలాది వృక్షాలు దగ్దమవుతున్నాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వన్యప్రాణాలకు ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు స్పందించి మంటలను ఆర్పాలని స్థానికులు కోరుతున్నారు.