INS తారాగిరి విశేషాలివే..!

INS తారాగిరి విశేషాలివే..!

భారత నౌకాదళ అమ్ముల పొదిలో అత్యాధునిక యుద్ధ నౌక 'INS తారాగిరి' చేరిన విషయం తెలిసిందే. ఇది 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పుతో 6,670 టన్నుల బరువు ఉంటుంది. సముద్ర జలాల్లో గంటకు 28 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. బరాక్-8 వంటి విమాన విధ్వంసక, 8 బ్రహ్మోస్ నౌకా విధ్వంసక క్షిపణులు ఇందులో ఉన్నాయి. శత్రువుల జాడను, ముప్పును ముందే పసిగట్టే రాడార్ వ్యవస్థ ఉంది.