మహిళా సదస్సును విజయవంతం చేయండి: యూటీఎఫ్

మహిళా సదస్సును విజయవంతం చేయండి: యూటీఎఫ్

మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించేందుకు ఈనెల 14న శ్రీకాకుళంలో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు వైకుంఠ రావు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం నరసన్నపేట ఎంఈవో కార్యాలయం వద్ద సదస్సుకు సంబంధించి పాంప్లెట్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఎన్ అప్పయ్య, తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.