VIDEO: అరటి తోటకు నిప్పు.. 6 వేల చెట్లు బూడిద

VIDEO: అరటి తోటకు నిప్పు.. 6 వేల చెట్లు బూడిద

KDP: ఓబులవారిపల్లి మండలం పెద్దఓరంపాడు గ్రామంలో ఆకతాయిలు నిప్పుపెట్టడంతో 5 ఎకరాల అరటి తోట పూర్తిగా దగ్ధమైంది. వల్లూరుపల్లికి చెందిన కొత్త పిచ్చమ్మ, రామసుబ్బారెడ్డి దంపతుల 6 వేల అమృతపాణి రకం అరటి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ. 6 లక్షల నష్టం జరిగిందన్నారు.