మున్సిపల్ చరిత్రలో భార్యాభర్తల 'హ్యాట్రిక్'!
వనపర్తి 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బీ.రమాదేవి 177 ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. గతంలో ఆమె భర్త బీ. కృష్ణ కూడా వరుసగా మూడుసార్లు గెలిచి వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇలా భార్యా భర్తలిద్దరూ హ్యాట్రిక్ సాధించడం వనపర్తి మున్సిపల్ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం. దీంతో వారకి వార్డు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.