VIDEO: చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదికి నీరు విడుదల
ATP: పెద్దపప్పూరు మండలం చాగల్లు రిజర్వాయర్ నుంచి పెన్నానదికి ఆదివారం ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి చాగల్లు రిజర్వాయర్‌కు నీరు వస్తుండటంతో 250 క్యూసెక్కుల నీటిని ఒక గేట్ ఎత్తి విడుదల చేసినట్లు ఏఈ హరి తెలిపారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.