VIDEO: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ శివారులో ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంను గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేకుంటే ఎవరైనా హత్య చేసి పడవేశారా? అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు సీఐ రమేష్ తెలిపారు.