VIDEO: మొక్కజొన్న పంట దగ్ధం
ATP: గుమ్మగట్ట మండలం తాళ్లకెరలో రైతు గొల్ల సన్న నాగన్నకు చెందిన ఐదెకరాల మొక్కజొన్న పంట గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్నిప్రమాదంలో బూడిదైంది. కుప్పగా వేసిన కంకులు, డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ. 7 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.