VIDEO: ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆధ్వర్యంలో 300 మంది మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మహిళా భక్తులకు చీర, రవిక, లక్ష్మీ రూపు అందించారు. అన్న సమారాధన ఏర్పాటు చేశారు.