VIDEO: దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు

VIDEO: దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు

ATP: తాడిపత్రిలో జరిగిన దాడి ఘటనపై వైసీపీ నేత ఎరుకల రామాంజినేయులు పట్టణ సీఐ ఆరోహణరావుకు ఫిర్యాదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, జింకా లక్ష్మీదేవి, హాజీవలి సహా 25 మంది కులం పేరుతో దూషిస్తూ తమపై రాళ్ల దాడికి తెగబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నట్లు సీఐ ఆరోహణరావు సోమవారం తెలిపారు.