VIDEO: 'గ్రీన్ అంబాసిడర్ల జీతాలు చెల్లించాలి'

PPM: గ్రీన్ అంబాసిడర్ల 10 నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ర్యాలీని చేపట్టారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధ రావు మాట్లాడుతూ.. గ్రీన్ అంబాసిడర్లకు 6000 జీతం మాత్రమే చెల్లిస్తుందని సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడం దారుణం అని అన్నారు. అనంతరం వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.