నిజాంసాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి.. నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. సోమవారం ప్రాజెక్టులోకి 14,564 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.079 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఒక వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.