చెరువును తలపిస్తున్న రోడ్డు

చెరువును తలపిస్తున్న రోడ్డు

SRD: కంగ్టి మండలం చౌకన్పల్లి వద్ద రోడ్డు చెరువులా తలపిస్తుంది. స్థానికంగా కల్వర్టు నిర్మించకపోవడంతో వర్షం పడినప్పుడు ఈ లోతట్టు రోడ్డుపై ఇలా నీళ్లు నిలుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌకన్పల్లి నుంచి కంగ్టి మండల కేంద్రానికి వెళ్లే BT రోడ్డు గుంతల్లో వర్షం నీళ్లు నిలిచాయి. దీంతో బైకులు, ఆటోలు, ఇతరత్రా వాహనాలు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నామన్నారు.