కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంది: ఎమ్మెల్యే

SKLM: కూటమి ప్రభుత్వ హయాంలో అన్నదాతకు అండగా నిలవడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం 'అన్నదాత సుఖీభవ' పథకం పంపిణీ సందర్భంగా నిర్వహించిన రైతు సంబర సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, ఈ దిశగానే సంబర ర్యాలీ చేపట్టామని పేర్కొన్నారు.