పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
NLG: పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని (స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు) కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపులోని ఏర్పాట్లను, మూల్యాంకన ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేస్తూ, ప్రస్తుత నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఈవో బిక్షపతి ఉన్నారు.