TIS నమోదు పూర్తి చేయండి: డీఈవో

ASR: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్స్ సర్వీస్ వివరాలను టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో శుక్రవారం సాయంత్రంలోగా నమోదు చేయాలని ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరావు సిబ్బందిని ఆదేశించారు. రంపచోడవరం విద్యా వనరుల కేంద్రంలో నమోదు ప్రక్రియను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ మండలాల్లో MEO కార్యాలయం సిబ్బంది టీచర్స్ సహకారంతో పూర్తి చేయాలని ఆదేశించారు.