గజపతినగరంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం
VZM: గజపతినగరంలోని పైడితల్లమ్మ ఆలయం వార్షికోత్సవం పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం ఆదివారం ఆలయ ధర్మకర్త కందుల చిన్నయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 8000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు యువత మహిళలు పెద్ద ఎత్తున సహకరించారు.