నేడు బద్వేలులో జల హారతి: కమిషనర్
KDP: బద్వేలులో నేడు జరగనున్న "స్వచ్ఛ ఆంధ్ర డే"లో భాగంగా బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరసింహారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీలో "జలధార-జల హారతి", చెరువుల శుభ్రత, కాలువల పూడికతీత, ఇంకుడు గుంతలపై దృష్టి సారిస్తామన్నారు. 5-స్టార్ రేటింగ్ లక్ష్యంగా SHGలు, యువత భాగస్వామ్యం కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.